ప్రజల ఆరోగ్య విషయంలో రాజీపడేదిలేదు.

మంత్రాలయం మండలానికి నూతనంగా కేటాయించిన 108, 104  వాహనాలకు శుక్రవారం ఉదయం శ్రీ మంచాలమ్మ మరియు రాఘవేంద్ర స్వామి ఆలయం ముందు ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు వై సీతారామిరెడ్డి గారు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అత్యవసర ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రికార్డు స్థాయిలో 1088  నూతన  108 మరియు 104  వాహనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని  చెప్పారు. ఈ నూతన108, 104 వాహనాలు అత్యాధునిక సదుపాయాలు కలిగి అత్యవసర సమయంలో మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం సీఐ.క్రృష్ణయ్య వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు జి.భీమిరెడ్డి మండల ఇంచార్జి విశ్వనాథరెడ్డి మరియు వెంకట్రామిరెడ్డి,మాజీ సర్పంచ్ భీమయ్య,
వైఎస్ఆర్ సి పి నాయకులు అశోక్ రెడ్డి, కురువ మల్లికార్జున, MPTC పులికుక్క రాఘవేంద్ర,శివప్ప,హోటల్ పరమేష్, భాస్కర్, సెంట్రింగ్ రాముడు తదితరులు పాల్గొన్నారు.