స్థానిక సంస్థల ఎన్నికల కోడ్, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు నేపథ్యంలో దాదాపు రెండు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. సోమవారం ఏపీలో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మందుబాబులు లిక్కర్ షాపుల ముందు ఎగబడ్డారు. కిలో మీటర్ల మేర క్యూ లైన్లలో నిలబడి మరీ మందు కొనుగోలు చేశారు. చాలా కాలం తర్వాత లిక్కర్ షాపులు తెరుచుకోవడంతో మందుబాబులు పూజలు చేయడం, డాన్సులు వేయడం వంటి విచిత్ర ప్రదర్శనలు సైతం చేశారు. చివరకు మందుబాబులు మొదటి రోజే జగన్ సర్కారుకు కిక్కెక్కించేలా లాభాలు తెచ్చిపెట్టారు.తొలి రోజే మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. తొలి రోజు ఏపీలో రూ. 68.7 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారికంగా ప్రకటించింది. మద్యం ధరలు 25 శాతం పెంచి అమ్మిన తర్వాత కూడా ఈ స్థాయిలో అమ్మకాలు జరిగడం విశేషం. మందుబాబులు లిక్కర్ షాపుల మందు భారీగా ఎగబడుతుండటంతో మంగళవారం మరో 50 శాతం ధరలు పెంచుతున్నట్లు జగన్ సర్కారు ప్రకటించింది. అంటే ఒక్కరోజు వ్యవధిలోనే ఏపీలో మద్యం ధరలు 75 శాతం పెరిగాయి.
జగన్ సర్కారుకు కిక్కెక్కించే ఆదాయం.. తొలి రోజు లిక్కర్ అమ్మకాలెంతో తెలుసా..!