చిరంజీవికి మాత్రమే.. నా కెరీర్‌లో ఇదే లాస్ట్: రెజీనా

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేగంగా జరుగుతోంది. ఇందులో ప్రముఖ నటి రెజీనా కస్సాండ్రా ఓ ఐటెం సాంగ్‌లో నటించింది. ఈ సాంగ్ గురించి రెజీనా ఓ సందర్భంలో మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ స్పెషల్ సాంగ్ అంది. ‘చిరంజీవిగారు నటిస్తున్న ఆచార్య సినిమాలో ఆయనతో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌లో నటించాను. ఇదే నా కెరీర్‌లో ఫస్ట్ అండ్ లాస్ట్ సాంగ్. సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంది చేస్తారా అని ఆచార్య టీం నాకు ఫోన్ చేసినప్పుడు మరో క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే ఓకే చేసేసాను'నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అందులోనూ చిరంజీవిగారి పక్కన అంటే అంతకంటే లక్ ఇంకేముంటుంది. అయితే మరో స్పెషల్ సాంగ్ కోసం మాత్రం ఇక అస్సలు ఒప్పుకోను. ఇది ఐటెం సాంగ్ కాదు. సెలబ్రేషన్ సాంగ్ అంటే బాగుంటుంది’ అన్నారు. ఈ పాటను రాత్రి వేళల్లోనే చిత్రీకరించారు. ఇందుకోసం రెజీనా ఆరు రోజులు కాల్‌షీట్స్ ఇచ్చారట. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో చిరుకి జోడీగా త్రిష నటిస్తున్నారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు. ఇటీవల సినిమాకు సంతకం చేసి కాల్‌షీట్స్ ఇచ్చినట్లు సమాచారం.